సుఖులారా సంఘంపు బడి సంభంబునకు

588

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి ||సఖులారా||

  1. విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు ||సఖులారా||

  2. మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు ||సఖులారా||

  3. పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి ||సఖులారా||

  4. ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగ బఠియింప దగుచిత్రముగ ||సఖులారా||

  5. మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు ||సఖులారా||

  6. శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని ||సఖులారా||

  7. ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సార బ్రార్థింతము హితులారా ||సఖులారా||

Post a Comment

أحدث أقدم