ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు

587

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేడెదము మేలైన దీవెనలు మెండుగా గురిపించి ||యాలించు||

  1. ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||

  2. ఇందు గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||

  3. ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపుల జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రుల జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||

  4. నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||

  5. చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగ బ్రకటింప గ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమ దగినట్లు తెలిపించి ||యాలించు||

Post a Comment

أحدث أقدم