మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు

589

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు మరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయుపనుల్ వినలేదమ్మా?||

  1. సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధ నమ్ములమ్మ||

  2. అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట నున్నారమ్మ||

  3. ఘనుడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలతుల ప్రేమింపవలె వినుమ దూషింపక దీ వించు మమ్మ||

  4. పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన దెల్పుమమ్మ ఒనరంగా నేడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ||

  5. ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా ధనములమ్మ ||

    ✍ పురుషోత్తము చౌధరి

      Mana Deshambhuna Kreesthu – Suvaartha Vyapinchutaku – Maargambhu Sthrilanchu – Maravukamma – Panibhooni Prabhukoraku – Paradehsambhulayandhu – Ghanuraandru Cheyupanulb- Vinaledhamma? Mana Deshambhuna

    1. Saatiainatuvanti – Saayambhavai Pathiki – Loulekunda Nepudu – Lobadu Mammu = Paatupadi Nee Suthula – Bhayabhakthitho Penchi – Naatumu Madhilona Bhodha – Nammulamma Mana Deshambhuna

    2. Anapaanamulandhu Nalavaatulandhu Nee – Panyulku Maadiri – Vagudu Vammu = Ninnu Nee Gama – Ninchi Pareekshinchu – Chunnavaarinta Bhaita – Nunnaramma Mana Deshambhuna

    3. Ghanundau Devuni Vaakya–Muna Judiviyo Viniyodhina Mekaanthamugapraardhimchu Mammu = Dhinaalenu Nee Porugu – Nelathula Premimpavale – Vinuma Dhoos Paka Dhi – Vinchu Mammu Mana Deshambhuna

    4. Panulnno Nee Kunna – Prabhu Yesu Shubhavaatha Dhinamuna Kokkarikaina –Delpumammu – Onarangaa Nedaadhi – Koka Yaathmanaina Nika = Nenarutho Rakshimpa Nerchukommu Mana Deshambhuna

    5. Yellasevakula Kora = Kellappudu Praardhimpa – Thallula Smaajamunaku – Chellu Namma – Pallelo Shubhavaartha – Prabhavimpavalenenno – Thallule Manchi Saa – Dhanamulamma Mana Deshambhuna Mallela David

Post a Comment

أحدث أقدم