535
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ బ్రోవుమా||
- మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా యందు జూపుమా||
- చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ మరువనీకుమీ||
- ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు మఖిలకాలము||
- పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ జేర గరుణజూపుము ||
إرسال تعليق