విశ్వాకాశము లాదులను సృష్టించిన

592

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విశ్వాకాశము లాదులను సృష్టించిన విభు డగు పరమ ఈశుడు సర్వశక్తు డగు || భాసుర తండ్రిన నమ్ముదును || నమ్ముదును నే నమ్ముదును ||

  1. పరిశుద్ధాత్ముని మూలమున మరియ కన్యకా గర్భమున ధరియింప బడి పుట్టిన శ్రీ గురు ప్రభుయేసును నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||

  2. పొంతి పిలాతుని కాలమున నెంతో శ్రమపడి సిల్వబడి వింతగ యధోతుల మందెనని || నమ్ముదును నే నమ్ముదును ||

  3. మూడవనాడు మృతి నుండి వడిగా బునరుత్థానుండై చూడగ బరమున కేతెంచె నాధుని కుడియెడ గూర్చుండెన్ || నమ్ముదును నే నమ్ముదును ||

  4. అక్కడ నుండి యిహమునకు గ్రక్కున వచ్చి సజీవులకు నిక్కము న్యాయముమృతులకును జక్కగ దీర్చెడు నని మదిని || నమ్ముదును నే నమ్ముదును || నమ్ముదును నే నమ్ముదును ||

  5. పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||

  6. పరిశుద్ధ పరచంబడిన సర్వసాధారణ సంఘం పరిశుద్ధుల యన్యోన్య మగు పరిశుద్ధ స్నేహము కల వంచు || నమ్ముదును నే నమ్ముదును ||

  7. మహికర్మ పరిహారమును దేహ పునరుత్థానము బహుళము నిత్య జీవమును మహిమ యనంతమై వెలయు నని || నమ్ముదును నే నమ్ముదును ఆమేన్||

Post a Comment

أحدث أقدم