591
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- శ్రీ దేవసుతు డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవుని గూర్మితో నమ్మెద ||త్రియేక||
- పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద దేవ కొట్టబడి చనిపోయి పెట్టబడి భూమిలో మూడవ దినమందు మృతి గెలిచి లేచెను ||త్రియేక||
- పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికి గుడివైపు దేవ సింహాసనముమీద స్థిరముగా గూర్చుండి యున్నాడు చిరన్యాయ కర్తయై యున్నాడు ||త్రియేక||
- అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగ దీర్పు దీర్చుటకు దేవ మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబు దీర్చును న్యాయవంతుడు యేసు ||త్రియేక||
- శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను నిజ మిది ||త్రియేక||
- పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా నమ్మెద ||త్రియేక||
- నిత్యజీవము
إرسال تعليق