అనుకరించెద నే ననుదినమును

543

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    అనుకరించెద నే ననుదినమును బాలు డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుడేసు ||ననుకరించెద||

  1. పరదేశంబున వసించి పరమాత్తుని మది దలంచి దురితమును జయించిన స చ్చరితుడైన యోసేపు ||ననుకరించెద||

  2. తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టముల దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||

  3. పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమున బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||

  4. శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||

  5. పరులకు న్యాయంబు దీర్ప బ్రజలకు క్షేమంబు గూర్ప పరమ వివేకంబు గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||

  6. యజమానుని కుష్ఠు గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||

  7. అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||

  8. ప్రార్థన కూటమున జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగ బేతురుని సమాచార మిడిన రొదే ||ననుకరించెద||

  9. భక్తిభయములందు బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||


Post a Comment

أحدث أقدم