వారు ధన్యు లైన పిల్లలు

542

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు వారు ధన్యులైన పిల్లలు కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన వారికిని విధేయులైన ||వారు||

  1. అన్నదములందు నెటులను తనతోడ నాడు చున్న యితరులందు నటులను భిన్న మెంచ కొక్కరీతి దన్నుబోలె ప్రియ మొనర్చి తిన్నని బడియందు నేర్చు చున్నవార లెవ్వరో ||వారు||

  2. ఒక్కడె తండ్రి యతడు దేవుడు మన కందరకును సకల సుఖములిచ్చు నెప్పుడు అకట మన మికను జగడము లాడదగదు ప్రభుని రీతి నొకని నొకడు ప్రియము చేసి యుండుద మని తలచుచుండు ||వారు||

  3. మంచి మేలు లనుభవింపగ గరుణించి దేవు డెంచి మనల నిచట గూర్చెగ వంచనల ద్యజించి కనిక రించి యొకనినొకడు మది స హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు||

  4. ఆకసమున నున్న దేవుడు మన మనసు రాక పోక లన్ని చూచు నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగ జేసి ప్రాకాటముగ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో ||వారు||

Post a Comment

أحدث أقدم