ఎల్ల వేళలందు కష్టలమందు

635

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప||

  1. విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల||

  2. సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||

  3. జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ||ఎల్ల||

  4. జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల||

  5. నిత్యుడ నీవే నా సత్యుండ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల||

  6. జీవము నీవే నా దేవుడు నీవే పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల||

  7. కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల||

Post a Comment

أحدث أقدم