నా నిమిత్తమాయన మహిని

665

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను ఘనధనముల రోసెను అనుమతించె చావుకునా నిమిత్తమె (3) మరణ మాయెను తన జీవమును నాకు బలిగా ధారపోసెను ||నా నిమి||

  1. గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||

  2. అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమి||

  3. అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్ క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమి||

  4. రోగముల్ భరించెను వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమి||

  5. గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమి||

  6. ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమి||

  7. తన యనుభవమున్ మనల దోషరహితులన్ చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమి||

Post a Comment

أحدث أقدم