ఇల పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే

569

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఇల పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభు డిడు బలు దీవెనల ||నిల||

  1. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేల గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ ||నిల||

  2. మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాల దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె ||నిల||

  3. తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలది ||నిల||

Post a Comment

أحدث أقدم