నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం

662

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం గనుక ||నమ్మ||

  1. మిమునుగన్న తల్లి యేది మిమ్మునుగన్న తండ్రియేడి నాతోడబుట్టిన తోడులు యేరి వార్ని కాటికి మోసిన కోటప్ప లేరి గనుక ||నమ్మ||

  2. మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు కట్టిన కోటలు ఏవి కొట్టి తిన్న పొట్టలు ఉన్నవా? మెట్టలు పల్లాలవ్వక మానునా గనుక ||నమ్మ||

  3. మీరు త్రవ్విన బావులు ఏవి మీరు త్రాగిన నదులు ఏవి ఏరులు ఎండకుండునా? కారులు మరచెడకుండునా గనుక ||నమ్మ||

  4. మీరు కట్టిన బట్టలు ఏవి చుట్టి త్రాగిన చుట్టలు ఏవి కట్టినబట్ట మట్టికెకదా? చుట్టిన చుట్ట అగ్గికి కదా గనుక ||నమ్మ||

  5. మనం మట్టినుండి తీయబడితిమి మట్టితో పుట్టబడితిమి ఎట్టి బ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి పదపదరన్నా గనుక ||నమ్మ||

  6. యేసు ప్రభుని నమ్మండిప్పుడే మోసపోకుడి ఈ ధరణిలో ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా గనుక ||నమ్మ||

Post a Comment

أحدث أقدم