ఇదిగో నీ రాజు వచ్చుచుండె

632

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||

  1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో||

  2. రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో||

  3. స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో||

  4. దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో||

  5. ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో||

  6. దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో||

  7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె ||ఇదిగో||

Post a Comment

أحدث أقدم