4
రాగం - కాంభోజి
సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ||
- ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ||
- వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ||
- ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||
- చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ దన్ను వేఁడు మహేష్టులను రక్షించును ||సర్వ||
- దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే ||సర్వ||
✍ మిక్కిలి సమూయేలు
akk 7
إرسال تعليق