7

7

రాగం - కాంభోజి తాళం - ఆది

    సన్నుతింతుమో ప్రభో
    సదమలమగు భక్తితో } 2
    కన్న తండ్రి కావుమా
    కలుషము నెడబాపుమా || సన్నుతింతుమో ||

  1. నీతి సూర్య తేజమా
    జ్యోతి రత్న రాజమా } 2
    పాతక జన రక్షకా } 2
    పతిత పావన నామకా || సన్నుతింతుమో ||

  2. మానవ సంరక్షకా
    దీన నిచయ పోషకా } 2
    దేవా మానవ నందనా } 2
    దివ్య సుగుణ మందనా || సన్నుతింతుమో ||

  3. ప్రేమ తత్వ బోధకా
    క్షేమ దాత వీవెగా } 2
    కామిత ఫలదాయక } 2
    స్వామి యేసు నాయక || సన్నుతింతుమో ||

  4. పాప చింతలన్నిటిన్
    పారదోలుమో ప్రభో } 2
    నీ పవిత్ర నామమున్ } 2
    నిరతము స్మరియించెదన్ || సన్నుతింతుమో ||


    ✍ బొంతా సమూయేలు
akk 7

Post a Comment

أحدث أقدم