4
రాగం - కాంభోజి తాళం - ఆదితనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగ బండు కొనజేయును గనుక ||నాకేమి||
ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుదు శాంత జలములు నా చెంతనే యుండు గనుక ||నాకేమి||
తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లజేసి నాకు దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||
నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకు దనను నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||
చావు చీకట్ల శక్తియుండు ఆహా లోయలోబడి పోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక ||నాకేమి||
మీదబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక ||నాకేమి||
పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుగని సౌఖ్యభో జన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక ||నాకేమి||
తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక ||నాకేమి||
పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల గల గిన్నె నా కలిమిగా జేయున్ గనుక ||నాకేమి||
బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక ||నాకేమి||
దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక ||నాకేమి||
إرسال تعليق