13

4

రాగం - కాంభోజి తాళం - ఆది

    నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు ||నా||

  1. తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను మిగుల దయచేత జూచితివి తండ్రి నన్ను ||నా||

  2. పాప కూపమునందు బడియుండగా నన్ను బారజూచి చేయి చాపి యేసునిద్వార చక్కగాదెచ్చితివి చాలు దేవా ||నా||

  3. సుఖఃదుఖ కాలములు శోధింప బంపుదువు శోభాయుక్త నాకు సుఖము గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా||

  4. సకల కాలంబుల జక్కగ లోబడి నన్నుతింతు నన్ను ఆకలంకునిగా జేయు మనుచు వేడుచునుందు నధికాసక్తి ||నా||

Post a Comment

أحدث أقدم