12
- జీవమా, యెహోవా నీకు జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే
||దేవ||
- చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే
||దేవ||
- యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే
||దేవ||
- ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయ మిచ్చున్ విభుండు మార్గము తెలిపె, మోషేకు దన కార్యములను విప్పె నిశ్రా యేలు జనమునకు ఆ కారణముచే
||దేవ||
- అత్యధిక ప్రేమ స్వరూపియైన ధీర్ఘ శాంతపరుండు నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముం చడు ఆ కారణముచే
||దేవ||
- పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు భూమి కన్న నాకసంబున్న యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున ఆ కారణముచే
||దేవ||
- పడమటికి దూర్పెంత యెడమో పాపములకును మనకు నంత యెడము కలుగజేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే
||దేవ||
- కొడుకులపై దండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు ఆ కారణముచే
||దేవ||
- మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపుచుండును ఆ కారణముచే
||దేవ||
- పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన వాస పుష్పము వలెనె నరుడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు ఆ కారణముచే
||దేవ||
- పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును గృప నిలిచి యుండును యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే ||దేవ||
إرسال تعليق