11

11

రాగం - కాంభోజి తాళం - ఆది

    చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు చక్కఁగా నీవైపు ||చూచు||

  1. మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ బ్రేమను జూపితివి ||చూచు||

  2. నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు ఇనుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన మైన నీ కృపఁ ||చూచు||

  3. నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||

  4. దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల మా తండ్రి ||చూచు||

Post a Comment

أحدث أقدم