త్రియేకదేవుడైన యెహోవాను కెరూబులు

Song no: 136
HD

    త్రియేక దేవుడైన యెహోవాను
    కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
    పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
    గాన ప్రతి గానములు చేయుచు ఉండును

  1. నా శాపము బాపిన రక్షణతో
    నా రోగాల పర్వము ముగిసేనే
    వైద్య శాస్త్రములు గ్రహించలేని
    ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||

  2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
    పరిశుద్ధాత్మలో ఫలించెదనే
    మేఘ మధనములు చేయలేని
    దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||

  3. నా స్థితిని మార్చిన స్తుతులతో
    నా హృదయము పొంగిపొర్లేనే
    జలాశయములు భరించలేని
    జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||

Post a Comment

أحدث أقدم