Song no: 135
- సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
- ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను || సాగిపోదును ||
- నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే || సాగిపోదును ||
- శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును || సాగిపోదును ||
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
సాగిపోదును నా యేసయ్యతో
إرسال تعليق