Asraya dhurgamu neevani rakshana srungamu neevenani ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని

Song no: 137
HD
    ఆశ్రయదుర్గము నీవని
    రక్షణ శృంగము నీవేనని||2||
    నా దాగుచోటు నీవేనని
    నా సమస్తమును నీవేనని||2||

  1. నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక
    నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు
    మరణాంధకారములో బంధించబడిన నీ జనులను
    మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు || ఆశ్రయ ||

  2. నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా
    నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు
    కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు
    ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు || ఆశ్రయ ||

  3. నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక
    నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు
    ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను
    జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు || ఆశ్రయ ||

Post a Comment

أحدث أقدم