الصفحة الرئيسية بلا عنوان byOnline Lyrics List —يوليو 18, 2024 0 Krupa ministries ద కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి "2" అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి "2" || కొరతేలేని || 1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది "2" నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య "2" || కొరతేలేని || 2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది "2" నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య "2 || కొరతేలేని || 3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య"2" || కొరతేలేని || దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము } 2 || దీనుల || విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా } 2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు } 2 || నీవే నా || విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి } 2 నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి } 2 || నీవే నా || నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి } 2 క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను } 2 || నీవే నా || Post a Comment أحدث أقدم
إرسال تعليق