Vijaya samsthuthule neeku prema swqarupa విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప

Song no: 11

      విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూప - విజయ సంస్తుతులు నీకు = జయము లభించు నీకు - విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన - ప్రణుతులు సిద్ధించు నీకు || విజయ ||

    1. నేడు మాపనులెల్లను దీవించుము - నిండుగా వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు - శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను - సమ కూడ జేసిన నీకే కీర్తి || విజయ ||

    2. ఆటలాడుకొన్నను నీ నామమున - పాటల్ పాడు కున్నను = నాటకంబుల్ కట్టుకున్నను - నాట్యమాడుచు మురియుచున్నను - కూటములను జరుపుకున్నను - నీటుగను నీ కేను కీర్తి || విజయ ||

    3. పరలోకమున కీర్తి - దేవా నీకే ధరణియందున కీర్తి = నరుల హృదయములందు కీర్తి - పరమ దూతలందు కీర్తి - జరుగు కారయములందు కీర్తి - జరుగని పనులందు కీర్తి || విజయ ||





    (chaaya : stuti chaeya raMDi, raMDi)



      vijaya saMstutulae neeku - praema svaroopa - vijaya saMstutulu neeku = jayamu labhiMchu neeku - viSvamaMtaTa sarva deeksha - prajala valana nityamaina - praNutulu siddhiMchu neeku || vijaya ||

    1. naeDu maapanulellanu deeviMchumu - niMDugaa vardhillunu = chooDavachchina vaarikini bahu - Subhakaramugaa nuMDunaTula - keeDu baapuchu maeLLanu - sama kooDa jaesina neekae keerti || vijaya ||

    2. aaTalaaDukonnanu nee naamamuna - paaTal^ paaDu kunnanu = naaTakaMbul^ kaTTukunnanu - naaTyamaaDuchu muriyuchunnanu - kooTamulanu jarupukunnanu - neeTuganu nee kaenu keerti || vijaya ||

    3. paralOkamuna keerti - daevaa neekae dharaNiyaMduna keerti = narula hRdayamulaMdu keerti - parama dootalaMdu keerti - jarugu kaarayamulaMdu keerti - jarugani panulaMdu keerti || vijaya ||
Copyright © Lyrics List. Designed by OddThemes