Rajadhi raja ravaa rajullaku rajuvai ravaa రాజాధిరాజా రావారాజులకురాజువై రావా

Song no:

    రాజాధిరాజా రావా
    రాజులకురాజువై రావా
    రాజు యేసు రాజ్య మేలరావా రవి కోటి తేజ యేసు రావా (2)
    రాజాధిరాజా రావే

  1. ఓ...........
    భూజనంబులెల్ల తేరి చూడగా
    ఓ....
    నీజనంబు స్వాగతంబు నియ్యగా
    నీ రాజ్యస్థాపనంబుసేయ
    భూరాజులెల్ల కూలిపోవ
    భూమిఆకాశంబుమారిపోవ
    నీ మహాప్రభావమున వేగ
    రాజాధిరాజరావా రాజులకురాజువై రావా

  2. ఆ............
    ఆ ఆకాశమున దూత లార్బటింపగా
    ఆ........
    ఆది భక్త సంఘ సమేతంబుగా
    ఆకసంబు మధ్య వీధిలోన
    ఏకమై మహాసభ సేయ
    లోకనాథ నీదు మహిమ లోన
    మాకదే మహానంద మౌగ
    రాజాధిరాజా రావే
    రాజులకు రాజు వై రావే

  3. ఓ................
    పరమ యెరూషలేమ పుణ్య సంగమా
    ఓ.......
    గొర్రె పిల్ల క్రీస్తుపుణ్య సంఘమా
    పరమ దూతలారా భక్తులారా
    పౌలపోస్తులా రా పెద్దలారా
    గొర్రె పిల్ల యేసు రాజు పేరా
    క్రొత్త గీత మెత్తి పాడ రావా
    రాజాధిరాజా రావా
    రాజులకు రాజువైరావా

Post a Comment

أحدث أقدم