కనిపెట్టు చుంటినీ.. ప్రభువా నీ సన్నిధినీ....
నిన్ను ఆశ్రయించితినీ .. శరణము నీ వనీ....|2|
దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని ...
ప౹౹ నా కన్నీరు కాదనకూ...నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ ౹2౹ "కనిపెట్టు"
నీవు నాటిన మొక్కను నేను కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను దాయుమూ సుడిగాలులనుండి ... (2)
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా....
కనికర పడవయ్యా.... కారుణామయుండా... ౹నా కన్నీరు౹
నీవు రాసిన రాతను నేను నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను చూడుమూ ఆశతో ఉన్నా (2)
నిందలచేత నిష్టురమయ్యా ఆదరణ చూపవా ఆరాదనీయుడా ౹నా కన్నీరు౹
إرسال تعليق