ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥
ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥
నీ సన్నిధిలో ప్రతి ఉదయం
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం ॥2॥
నింపును నాలో నూతన ధైర్యం ॥2॥
॥ఆరంభించెద॥
నీ చిత్తముకై ప్రతి విషయం
అర్పించెద నీ కృపకోసం
వేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥
పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥
॥ఆరంభించెద॥
నా పెదవులతో ప్రతినిమిషం
స్తుతియించెద నీ ఘననామం
దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥
కాల్చును నాలో అహం సర్వం ॥2॥
॥ఆరంభించెద॥
إرسال تعليق