Uhinchalenayya vivarinchalenayya yenaleni nee premanu ఊహించలేనయ్య వివరించలేనయ్యా ఎనలేన

ఊహించలేనయ్య వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను
నా జీవితాంతం ఆ ప్రేమలోనే
తరియించు వరమే దొరికెను ||ఊహించ||

1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను
         ||ఊహించ||

2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము
         ||ఊహించ||

Post a Comment

أحدث أقدم