యేసయ్య వందనాలు నీకు
శతకోటి స్తోత్రాలు " 2 "
మంచి నాలో లేకున్నా
మాకు రక్షణ ఇచ్చావయ్య
నూతన వత్సరమిచ్చి
మమ్ము దీవించినావయ్య
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య " 2 "
నాకష్ట దినములలో నాతోడై
నిలచిన యేసయ్య నీకే స్తోత్రం
శోధన వేదనలో తోడుగా నిలిచావే " 2 "
నీవంటి దేవుడు ఇలలో లేనే లేడు
వేయి నోళ్ళతో స్తుతియించిన
తీర్చగలన నీ ఋణమును
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య " 2 "
నే వెళ్లే ప్రతి మార్గమందు నీవు
నాముందుగా నిలచి నడిపించితివి
కంటికి రెప్పవలే నను కాపాడితివి " 2 "
గొప్ప భాగ్యము నాకొసగి
నీ పాత్రగ నను మలచితివే
నీదు సాక్షిగా నను నిలిపి
నీ సొత్తుగ నను చేసితివే
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య" 2 " యేసయ్య
إرسال تعليق