గడిచిన కాలమంతా...........
నను నడిపైన దేవా...........
నీకంటి పాపలాగా.............
కాపాడిన నా ప్రభువా......... "2"
మరో ఏడు నాకొసగినందుకు
నీకేమి నే చెల్లింతును.........
నీ ప్రేమను పంచినందుకు....
నిన్నేమని కీర్తింతును.......... "2
" గడిచిన "
(1)
ఇచ్చిన వాగ్ధానం మరువక........
నిలుపు దేవుడువు..................
శూన్యమందయిన..................
నీకలం సాధ్యపరచెదవు........... "2"
నా మేలు కోరి నీ ప్రేమతో..........
నను దండించితివి...................
చేలరేగుతున్న డంబములు.......
నిర్మూల పరిచితివి................... "2"
" మరో ఏడు "
(2)
నాదు కష్ట కాలములోన............
కంట నీరు రాకుండా.................
నాదు ఇరుకు దారుల్లోన...........
నేను అలసిపోకుండా................ "2"
నా సిలువ భారం తగ్గించి..........
నీవేగా మోసితివి......................
నీ ప్రేమలో నను పోషించి...........
సత్తువ నింపితివి...................... "2"
" మరో ఏడు "
إرسال تعليق