సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య "2"
గడచిన కాలమంతా నీ
చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు " 2 "
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు " 2 "
" నీకే వందనం "
బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు " 2 "
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు " 2 "
" నీకే వందనం "
إرسال تعليق