Yesayya nijamaina dhevudavani ninne nammiyunnamu యేసయ్య నిజమైన దేవుడవని నిన్నే నమ్మియున్నాము

యేసయ్య నిజమైన దేవుడవని
నిన్నే నమ్మియున్నాము
ఈ లోకానికి ఈ జీవానికి
నిన్నే ప్రకటిస్తున్నాము    " 2 "
రాజులకు రాజువని
ప్రభువులకు ప్రభువువని
ఇమ్మానుయేలువని మాకై జన్మించావని

ఉంటావులే ప్రభువా
అపత్కాలములో మాతోడుగా
చేస్తావులే ప్రభువా
అద్భుతకార్యాలెన్నో ప్రేమగా
మీలాంటి రక్షకుడు మాకుండగా
మాకు భయమన్నదే లేదే
మీలాంటి స్నేహితుడు మాకుండగా
మాకు దిగులన్నదే రాదే
ఉంటావులే మా కడవరకు             }
విడువనంటావులే యుగయుగాలకు } " 2 "
సర్వోన్నతమైన స్థలములలో
నీకే మహిమ              "  యేసయ్య  "

వస్తావులే ప్రభువా కష్ట కాలంలో మాఅండగా
దీవిస్తావులే ప్రభువా
ఆశీర్వాదాలతో మెండుగా
రాజువు అయిన రక్షకుడవు అయిన
ఈ లోకానికి నీవేలే
దీనులను దరిద్రులను
లేవనెత్తువాడవు నీవేలే
వచ్చావులే మా ధరణికి      }
చేరుస్తావులే పరలోకానికి  } " 2 "
సర్వోన్నతమైన స్థలములలో
నీకే మహిమ              "  యేసయ్య"

Post a Comment

أحدث أقدم