కునుకకా నిదురపోక
సంవత్సరమంతా కాచికాపాడిన దేవా
నీ ప్రేమకు వందనం
విడువక చేయి వదలకా
నీ రెక్కల క్రింద దాచిన దేవా
నీ కృపకు స్తోత్రం " కునుకకా "
వందనం వందనం వందనం
స్తోత్రము స్తోత్రము స్తోత్రము "2"
బ్రతుకు దినములన్నీ.......
కరువు అనేది రాకుండా
నా సహాయకుడిగా పోషించినావు
నా ఇరుకు మార్గమును....
విశాలపరచి నన్ను నీతో నడిపించినావు "2"
పాతవి గతియింపజేసి క్రొత్తవిగా మార్చి
నూతన సృష్టిగా నన్ను మార్చినావు " 2 "
వందనం వందనం వందనం
స్తోత్రము స్తోత్రము స్తోత్రము "2"
" కునుకకా "
జీవించు క్షణములన్నీ.....
విడువక తోడై అద్భుత కార్యలేన్నో
నాపై చేసావు
క్షమియించు గుణము నిచ్చి.....
నీ పరిచర్యలో సంవత్సరమంతా
నన్ను వాడుకున్నావు " 2 "
నూతన వత్సరం నాకు దయచేసి
నీ దయా కిరీటం నాపై వుంచావు " 2 "
వందనం వందనం వందనం
స్తోత్రము స్తోత్రము స్తోత్రము "2"
" కునుకకా "
إرسال تعليق