ప్రేమలు పొందిన నీ యాహ్వానము నన్ను పిలిచినది
కరుణ నిండిన నీ కనుజోయి నన్ను చూచినది//2//
యేసయ్య...యేసయ్య...యేసయ్య...యేసయ్య...||అ. ప||
హృదయ సీమాయే గాలి సంద్రమై సుడులు తిరిగినది
ఎగసిన కేరటాలెన్నో నన్ను తాకినవి ||2||
నావ మునిగి పోవుచున్నది జీవనాడి కృంగియున్నది
మాటలోనే సద్దు మణిపి నన్ను గాచితివే ||2||
నాతీరము చేర్చితివే...తీరము చేర్చితివే ||ఆ.ప||
||ప్రేమలు||
నిన్ను విడిచి దూరమయితిని పారిపోతిని
పొట్టకూటికి పాటుపడితిని పొట్టునే తింటిని ||2||
కన్నతండ్రి నన్ను విడువడు ఎన్నడైనా మరచిపోడూ
బుద్ధిమారి నిన్నుజేరితి కౌగిలించితివే||2||
నాకే విందు జేసితివే..విందు జేసితివే ||ఆ.ప||
||ప్రేమలు||
సిరులు నావియని తనువు నాదియని పొంగిపోయితిని
సిరులు కరిగి తనువు అలసి చూపుపోయినది ||2||
సిలువ చెంత శాంతి యున్నది క్షేమమేనా చేరువైంది
అంతిమముగా ఆశ్రయించితి ఆదరించితివే ||2||
కడదాకా నన్ను బ్రోచితివే నన్ను బ్రోచితివే
యేసయ్య...యేసయ్య...యేసయ్య..యేసయ్య..
||ప్రేమలు||
إرسال تعليق