తంబుర సితార నాదముతో దేవా స్తుతియింతును
గలమువిప్పి నా జీవితమంతా
నిన్నే కీర్తింతును నీకై జీవింతును
||తంబుర||
రమ్యములైన నీ దివ్య పలుకులు హృదిలో నిలిపితివే
నీబలిపీఠము చెంత చేర్చి మము తృప్తిపరచితివే ||2||
ఈ జీవిత యాత్రలో నీ ప్రేమ బాటలో
మా చేయిపట్టి నడిపించు తండ్రీ నీకే స్తోత్రమయ్యా
||తంబుర||
లోకమునుండి మమ్మును పిలిచి శక్తితో నింపితివే
జీవితమంతా సాక్షిగా నిలువ ధన్యత నిచ్చితివే ||2||
ఈ జీవితయాత్రలో నీ రెక్కల నీడలో
మాచేయిపట్టి నడిపించు తండ్రీ నీకే స్తోత్రమయ్యా
||తంబుర||
إرسال تعليق