ఆదరించు దేవుడా ఆరాధన పాత్రుడా
సేదదీర్చువాడ క్షేమమిచ్చు దేవుడా ||2||
నా గానమా నా బలమా
నా దుర్గామా నా యేసయ్యా ||2||
పాడెదను గీతములు ప్రాతఃకాలమున
చేసెదను నాట్యములు నీమందసము ఎదుట ||2||
ఎవరెన్ని తలచిన కింపరిచిన
నిన్నే నే కీర్తింతును నీతోనే పయనింతును || ఆదరించే ||
ముగ్గురిని బంధించి అగ్నిలో వేయగా
నాలుగవ వాడవై గుండములో నడచివావయా ||2||
రక్షించు వాడవై నీవు నాకుండగా
నిన్నే కీర్తింతును నీతోనే నే నడతును ||ఆదరించు||
మృతుడైన లాజరుకై కన్నీరు రాల్చితివి
శవమైన లాజరును లేపి జలము బయలు పరచితివి ||2||
నీ ఆత్మ శక్తి నన్ను ఆవరించగా
నిన్నే కీర్తింతును నిత్యజీవ మొందెదము ||ఆదరించు||
إرسال تعليق