Sathyamunaku mem sakshulam kreeshuku సత్యమునకు మేం సాక్షులము క్రీస్తుకు


Song no:

సత్యమునకు మేం సాక్షులము క్రీస్తుకు మేము సాక్షులము
రోషముగల దేవుని ప్రజలం సత్యము కలిగి జీవిస్తాం
రోషముగల దేవుని ప్రజలం సత్యము కొరకు మరణిస్తాం
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా
హోసన్నా. . హోసన్నా. . హోసన్నా. .
1. ఉమ్ములూసినా మొఖము త్రిప్పము
ముళ్ళు గ్రుచ్చినా తలను వొంచము
కొరడ విసిరినా వెనుక తిరుగముబల్లెము పొడిచినా భయపడము
సత్యము కలిగి జీవిస్తాంసత్యము కొరకు మరణిస్తాం

2. మాకు మేము తగ్గించుకొంటాం
మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధన చేస్తాం
సిలువ సంకెళ్ళ సమర్పణ చేస్తాందేవుని రాజ్యము రగిలిస్తాం
సత్యము కలిగి జీవిస్తాంసత్యము కొరకు మరణిస్తాం
أحدث أقدم