Sarvya chitthambbu needheynayya swarupamicchu సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు


Song no:

సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును
1. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి
పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు బోవ నను కడుగుమా
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా
నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే నీచేతబట్టి నన్ రక్షింపుమా

. ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున
అధికంబుగా నన్నీయాత్మతో ఆవరింపుమో నా రక్షకా
అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా
أحدث أقدم