Rende rendu dharulu ye dhari kavalo manava రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా


Song no:

 రెండే రెండు దారులు దారి కావాలో మానవా "2"
    ఒకటి పరలోకం మరియొకటి పాతాళం

    1. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం
    రాత్రి ఉండదు పగలు ఉండదుసూర్యుడుండడు చంద్రుడుండడు
    దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను
    యుగయుగములు పరలోక  రాజ్యమేలుచుండెను
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    2. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
    అగ్ని ఆగదు పురుగు చావదు
    అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
    అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు
    లాజరును చూసి దాహమని అడిగాడు
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    3. పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ
    గాలి మేడలు ఎన్నో కడతావునాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
    లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి
   అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో ||రెండే||


أحدث أقدم