Neevunna na gruhamu anandha nilayamu నీవున్న నా గృహము ఆనంద నిలయము

Song no:


నీవున్ననా గృహము ఆనంద నిలయము
నాకున్న సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము
ప్రభు స్తుతియించెదన్ నిను ప్రణుతించెదన్ నేను నా ఇంటివారితో
||నీవున్న||
1.నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్థమే
నీవే కరుణ చూపనిచో అనుభవించుట అసాధ్యమే
||ప్రభు||
2.నీవే కావలి కాయనిచో మేల్కొనియుండుట వ్యర్థమే
నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే
||ప్రభు||
3.నీవే కృపగల దేవుడవు మేలులతో తృప్తిపరచెదవు
నీవే సర్వసమర్ధుడవు సమృద్దితో నన్ను నింపెదవు
||ప్రభు||

أحدث أقدم