Pasibaludithadani pavana veevana veechi పసిబాలుడీతడని పవన వీవన వీచి

పసిబాలుడీతడని పవన వీవన వీచి
లాలిపాటలు పాడనేల చిరుగాలి
లాలి పాటలు చాలు స్తోత్రగీతికలల్లు
బాలుడీతడు కాడు బలమైనవాడే
పాల బుగ్గల పాపడీతడే గాని
పాపాల భారంబు మోయగలవాడే
మనుజాళి భారంబు మరి మోయగాదలచి
మహిమ లోకము వీడి మహికి దిగినాడే
పశులపాకను తాను పవళించియున్నా
పసిడి పరలోకపు జనతైక సుతుడే
أحدث أقدم