Paravasinchi padana parama sishuvu పరవశించి పాడనా పరమ శిశువు జన్మను

పరవశించి పాడనా పరమ శిశువు జన్మను
శిరమువంచి వేడనా సిరుల బాలయేసును
హాలేలూయా హాలేలూయా (2)
కరములు జోడించి విరిగిన హృదయముతో
వరసుతునికి పూజచేయనా
పరలోకము వీడిన ఆ వరదుని ప్రేమను మరువకనే తలపోయనా
ధరణీతలముపై నరుడై జన్మించిన పరమాత్ముని మదిని నిల్పనా
కరుణలు కురిపించు ఆ కారణజన్ముని నిరతము ఇలనే చాటనా
أحدث أقدم