Parama pavana deva narajanavana పరమపావన దేవ నరజనావన నిరత జీవన అద్భుత నిత్య రక్షణ

పరమపావన దేవ నరజనావన
నిరత జీవన అద్భుత నిత్య రక్షణ
అవతరించె నవ వినూత్న నామ రూపున
అవనిదోష మనసుతో నవ విమోచన
భువన తేజమా ఘన భావ రాజ్యమా
భజియింతుము నిజభక్తిని నీతిసూర్యమా
నీతి న్యాయముల వెలుంగు నిత్యదేవుడు
బేతలేము పురిని బుట్టె పేద గృహమున
ఆది వాక్యమా ఆద్యంత రహితమా
ముదమొప్ప మది నమ్మితి మాన్య చరితమా
సుగుణ శీలురుల్లమందు సంతసించరే
శుభప్రదుండు స్వామి యేసు చెంత కరుగరే
సుగుణ బృందమా ఆశ్రిత జనాంగమా
సుగుణాత్ముని శుభకాంతుని శ్రేష్ఠ మిత్రునిన్
أحدث أقدم