Naa ayusshu pogidinchavu na dhinamula parimanam నా ఆయుష్షు పొడిగించావు నా దినముల పరిమాణం


Song no:

నా ఆయుష్షు పొడిగించావు
నా దినముల పరిమాణం లెక్కించావు
నీ జీవగ్రంధమందు పేరును వ్రాసియుంచావు
ఇదే నా కృతజ్ఞత అర్పణయ్య

మరణము నుండి నాదు ప్రాణమును
కన్నీళ్ళు విడువకుండా నా కన్నులను
జారిపడిపోకుండా నా పాదములను
తప్పించి విడిపించి రక్షించితివే

నా అంగలార్పును
నీవు నాట్యముగ మార్చి
దుఃఖమునకు ప్రతిగా
సంతోష వస్త్రమిచ్చి
రెట్టింపు ఘనతను నీవు నాకు ఇచ్చి
నీ కృపలో బహుగా దీవించితివే
أحدث أقدم