అత్యంత రమణీయ అమరపురము వీడి

    అత్యంత రమణీయ అమరపురము వీడి
    అవనికి అరుదించితివా దేవా (2)
    అల్పులైన్న మాపై నీ ప్రేమ నిలుపా (2)
    సంకల్పించితివా తండ్రి బ్రోవా (2) || అత్యంత ||

  1. ఆదాము పాపము హరియింపగా
    నిర్మల గర్భము సృజియితివా
    రక్షణ కాలము అరుదించగా
    కన్యకు శిశువుగా జన్మించితివా
    భక్తుల మోకులు నేరవేర్చగా
    బేత్లహేములో ఉదయించినవ (2)
    ఘనత మహిమ  స్తుతులుఅనుచు
    దూతగానములు కీర్తనలు  పాడగా (2) || అత్యంత ||

  2. చీకటిలో చిరుద్వీపం విలిగించగా
    వేదనలో ఉపశమనం కలిగించగా
    సాతాను దాస్యము తొలగించగా
    శాంతి సందేశము వినిపించగా
    ధరపైన ప్రభురాజ్యం స్థాపించనించి
    నరరూపదరుడవై  జేనియించినవా(2)
    రాజులరరాజు ప్రభవించినడాఅనుచు
    గొల్లలు జ్ఞానులు దర్శించరగా || అత్యంత ||
أحدث أقدم