అకసాన సుక్కఎలిసె అర్ధరాత్రి పొద్దుపొడిసె

    అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
    సీకటంత పారిపాయెరా //2//
    మా సిక్కులన్ని తీరిపాయెరా
    మా దిక్కుమొక్కు యేసుడాయెరా //2//
    సంబరాలు ఈయాల సంబరాలు
    క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//

  1. గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేక
    మందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//
    ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –
    ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//
    ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..
    ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2// || అకసాన ||

  2. సల్లగాలివీసీంది సుక్కా దారి సూపింది
    జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
    బంగారు బోల కానుకలు తెచ్చారు
    వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
    ఆ దూతలంతా గానాలు చేశారు…..
    లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా //2// || అకసాన ||

أحدث أقدم