అంబరవీధిలో వింతైన తారక

    అంబరవీధిలో వింతైన తారక /2/
    సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/
    అంబరవీధిలో వింతైన తారక
    Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/

  1. దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగా
    కారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/
    సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ
    సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/
    Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/

  2. దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగా
    గొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/
    జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా
    క్రీస్తుయేసుని జననంతో  భువియే పులకరించగా /2/
أحدث أقدم