Yevaru leka ontarinai andhariki ne dhuramai ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై


ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై (2)
అనాథగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా (4)

స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
أحدث أقدم