Neevunnavani oke aasha nadipisthavani oke aasha నీవున్నావని ఒకే ఆశ నడిపిస్తావని ఒకే ఆశ

నీవున్నావని ఒకే ఆశ
నడిపిస్తావని ఒకే ఆశ

ఎవరున్నారు నాకిలలో (2)
నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో
ఎవరున్నారు నాకు యేసయ్యా
ఎవరున్నారయ్యా
నీవున్నావని ఒకే ఆశతో
నడిపిస్తావని ఒకే ఆశలో (2)
ఆదరిస్తావని ఆదుకుంటావని (2)
అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా

ఆశలే అడి ఆశలై
బ్రతుకెంతో భారమై (2)
కలలన్ని కన్నీటి వ్యధలై
గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||

ఆప్తులే దూరమై
బంధు మిత్రులకు భారమై (2)
నా అన్న వారే నాకు కరువై
గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||

యాత్రలో తుఫానులే
నా నావనే ముంచేసినా (2)
అద్దరి చేరే ఆశలే అనగారినా
గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||
أحدث أقدم