Neevundu chotuna Lyrics


నీవుండు చోటున నేనుండులాగున
నన్ను కొనిపోవుటకు రానున్న యేసయ్యా
అ.ప: మార్గమైయున్న నీ ద్వారా తప్ప
తండ్రియోద్దకు ఎవరూ చేరనే లేరయ్యా
1. తండ్రి నీలో ఉండి తనక్రియలు చేయుచుండెను
నిను నమ్మి నేను కూడా గోప్పపనులు చేయగలను
2. తండ్రి ఇంటిలో ఎన్నో నివాసములు కలవు
నా కొరకు స్థలమును నీవు సిద్ధపరచుచున్నావు
3. దాసుడని నన్ను పిలువక స్నేహితుడనన్నావు
నీ పక్కనే కూర్చుండే ధన్యతను గ్రహించావు
4. నీ నామమున ఏది అడిగిన చేస్తావు
సత్యమగు ఆత్మా ద్వారా నన్ను ఆదరిస్తావు


أحدث أقدم